Test Footer 2

04:47
0

Rana Latest Movie | RAJAMOULI :

 ఈగ' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి మరో భారీ ప్రాజక్టు చేబడుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఆయన స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా చారిత్రిక కథాంశంతో కూడి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం వందలాది గుర్రాలను తెప్పిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అలాగే, పలు భారీ సెట్స్ ను కూడా వేస్తున్నారు. 
       తెలుగుతో బాటు ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో కూడా రూపొందించి, అక్కడ కూడా దర్శకుడిగా తన ముద్ర వేయాలని రాజమౌళి తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇందులో రానా దగ్గుబాటి కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన నెగటివ్ పాత్రను దర్శకుడు రానాకు ఆఫర్ చేశాడట. ఇది తనకు వెరైటీ కావడంతో రానా కూడా అంగీకరించినట్టు చెబుతున్నారు. అలాగే, పలువురు బాలీవుడ్ తారలు కూడా ఇందులో నటిస్తారు.