Test Footer 2

02:04
0

మానువుల్లోకామోద్రేకం–దశలు మానువులలో కామోద్రేకం అనేది మనసుకు, కామాంగాలకే పరిమితం కాదు. శరీరంలోని ఎన్నో భాగాలు, వాటి విధులు కొన్ని మార్పులకు లోనవుతాయి. ఈ మార్పులు కొన్ని పైకి కనిపిస్తాయి. కొన్ని కనిపించవు. మనసులో పుట్టే కోరికల్నీ ఆలోచనల్ని, మెదడు జననాంగాల నుండి వచ్చే సంకేతాలను నరాలవ్యవస్థ సమన్వయపరుస్తుంది. సమన్వయ పరిచిన తర్వాత తిరిగి మళ్ళీ వివిధ శరీర భాగాలఃలో మార్పులను గమనించే మెదడు మరింత చురుకుగా పనిచేస్తూ ఆయా సంకేతాలను పంపిస్తుంది. ఒకటి –శరీరంలో రక్త ప్రవాహం వేగంగా ఉంటుంది. కొన్ని శరీర భాగాల్లోకి రక్తం అధికంగా ప్రవేశించి పొటెక్కుతాయి. రెండు –మెదడు నుండి, నరాల నుండి వచ్చే సంకేతాల వలన శరీరం అంతటా నరాలు, కండరాల బిగి పెరుగుతుంది. ఇవి బాగా శక్తిని పుంజుకుంటాయి. కామోద్రేకాన్ని నాలుగు దశలుగా విభజించడం జరిగింది. 1. కామోద్రేకత ప్రారంభ దశ 2. కామోద్రేకత స్థిరంగా వుండే దశ 3. బావప్రాప్తి దశ 4 కామోద్రేకత ఉపసంహరించుకునే దశ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ నాలుగు దశలూ ఎంత సమయం జరుగుతాయంటే చెప్పలేం. ఒక్కోక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. ఒకరిలో కూడా ఎప్పుడూ ఒకే సమయానికి జరుగుతాయని కూడా చెప్పలేం అప్పటి మానసిక పరిస్థితులు, అనుకూలత, వాతావరణాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది.