Test Footer 2

01:31
0

లవ్ చేస్తున్నారా...? ఐతే జస్ట్ ఓ లుక్ వేయండి...!





మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడానికి అతను మీకు "ఐ లవ్ యూ" అని చెప్పనసరం లేదు. అతనిలో ఈ కింది మార్పులను గుర్తించండి చాలు. వంద మాటలతో చెప్పే విషయాన్ని ఈ మార్పులతో గమనించవచ్చు. రండి...! అవేంటో ఒకసారి చూద్దాం....!

1. ఈ చిన్న విషయాలు మీకు గుర్తు చేస్తే... అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే...


మీ భాగస్వామి తను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయాన్ని మాటల్లో చెప్పడానికి ఇబ్బందిగా భావిస్తే అతను వేరే మార్గం ద్వారా(మాటల్లో కాకుండా) తన భావాలను వ్యక్త పరుస్తాడు. మీరు చాలా కాలం క్రితం మర్చిపోయిన చిన్న చిన్న విషయాలను అతడు గుర్తు చేస్తే అతడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లు లెక్క. ఉదాహరణకు మీకు నచ్చిన రంగు, సినిమా, మొదటి పరిచయంలో మీరు తెలిపిన విషయాలు, మీ పుట్టిన రోజుకి మీకు ఏమి కావాలో, అతనికి మీరు చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాలు... ఇలాంటివి మీకు గుర్తు చేసినట్లయితే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే.........!

2. మీకు ముఖ్యమైన వ్యక్తుల పట్ల అతను శ్రద్ధ చూపితే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే...

నిజం ఏంటంటే మీ స్నేహితుల గురించి మీరు చెప్పే సోది కథలు అతడు శ్రద్ధగా ఆలకిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు. మీ స్నేహితులను గౌరవించడం, మీకు ముఖ్యమైన వ్యక్తుల పుట్టిన రోజు పండుగలకు అతను హాజరవడం కూడా ఇందులో భాగమే. అయితే ఇలాంటి సందర్భాల్లో అతడు మీతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడక... మీతో చిరాకుగా ఉన్నట్లయితే.. అలాంటి వారిని దూరంగా ఉంచటమే శ్రేయస్కరం.

3. ఆకస్మికంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే...

మీకు సంతోషం కలిగించే విషయాలు, వస్తువులను అతడు ఆకస్మికంగా మీ ముందు ఉంచితే తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్ధం. ఉదాహరణకు బహుమతులు అందచేయడం, ప్రత్యేక కారణం ఏదీ లేకపోయినప్పటికీ మీకు నచ్చిన కొన్ని విషయాలలో శ్రద్ధ చూపటం. ఇంకా.. మీ రోజును సంతోషంగా గడపటానికి ఆకస్మికంగా సందేశాలు(మెసేజ్‌లు) పంపటం(ఫలితంగా ఆ రోజంతా మీరు అతని గురించే ఆలోచిస్తుంటారు), చిన్న ట్రిప్‌లు, డిన్నర్‌లు, మీకు విశ్రాంతి కలిగించటం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ దీనికి సంకేతాలు.

4. మీకు అతని అవసరం ఉన్నపుడు అతను మీతో ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే...


మీకు అతని అవసరం ఉన్నపుడు తన ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లయితే అది తను మీపై పెంచుకున్న ప్రేమకు సూచకం. నిజానికి ఇదే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనటానికి పెద్ద సంకేతం. ఎందుకంటే అతడు మీ అభిప్రాయాలను గౌరవిస్తూ.. మీకు అండగా ఉంటాడు. అంతే కాకుండా ఉతడు సరైన సమయానికి సరైన స్థలంలో ఉన్నట్లు అర్ధం.

5. మీతో రాజీ పడటానికి అతడు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే...


తనకి మీరు అన్నిటికన్నా ముఖ్యం అని చెప్పడానికి ఇదే అతి పెద్ద సంకేతం. మీ ఇద్దరి మధ్య జరిగే నిజాయితీ సంభాషణలో అతడు మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్ధం. ఈ బంధం మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. మీ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది.

6. ఈ విషయాలన్నీ లెక్క పెట్టండి ఒకవేళ జరిగితే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే...

పైన చెప్పిన విషయాలన్నీ మీరు అతనిలో గమనించండి. ఒక వేళ అవన్నీ కనుక జరిగితే అతడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు. అంతే కాకుండా అతడు మీ సంతోషం కోసం ఏదైన చెయ్యగలడని మీకు తెలిస్తే... తను మీకు "ఐ లవ్ యూ" అని చెప్పనవసరం లేదు.

మరి ఆలస్యం ఎందుకు... ఇక మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉన్నయో.. లేవో.. చూసి ప్రోసీడ్ అవ్వండి మరీ....!