Test Footer 2

00:47
0

Ram Charan In Nayak Movie Shooting

 

రామ్ చరణ్ కి నాయక్ చిత్రం షూటింగ్ యాక్షన్ సీక్వెన్స్ లో దెబ్బలు తగిలాయంటూ ఓ వార్త అంతటా ప్రచారమవుతోంది. ఆయన తన ముక్కుకి బాగా దెబ్బ తగలటంతో అపోలో హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లోనే కాక నెట్ లో కూడా కనిపిస్తోంది..వినపిస్తోంది. అయితే నిజా నిజాలు తెలియరాలేదు. ఈ విషయమై అధికారికంగా రామ్ చరణ్ కి చెందిన వారు వివరణ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే అభిమానులు ఈ వార్త విని ఆందోళన చెందుతున్నారు. ఇక రామ్ చరణ్ కి ఈ రకంగా ముక్కుకి దెబ్బ తగలటం వల్లే...జంజీర్ షూటింగ్ వాయిదా పడిందని చెప్పుకుంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న జంజీర్ డిసెంబర్ చివరి వారంలో షెడ్యుల్ ఉంది. అది కాన్సిల్ అవటానికి కారణం ఇదే అంటున్నారు. ఇక పిబ్రవరి 2013 వరకూ సంజయ్ దత్,ప్రియాంక చోప్రా డేట్స్ కూడా లేవట. దాంతో నెక్ట్స్ షెడ్యూల్ మరింత దూరం వెళ్లే అవకాసం ఉందని అంటున్నారు. ఇక ఈ వార్తే కనుక నిజమైతే త్వరగా కోలుకోవాలని కోరుకుం
దాం