Test Footer 2

01:40
0

Best Love Tips For Boys



దాదాపు ప్రతి అమ్మాయికి ఒక కలల రాకుమారుడు ఉంటాడు. అంతేకాక తన స్వప్నంలో సాక్షాత్కారించిన రాజకుమారునికి దగ్గరగా ఉండే యువకుని కోసం యువతి వెతుకుతూ ఉంటుంది. తన రాజకుమారుని కన్నా అధమంగా లేదా అధికంగా కనిపించే కుర్రవాళ్ల వైపు యువతి కన్నెత్తి కూడా చూడదు. అమ్మాయిల వ్యవహార శైలి ఒక రాగాన అంతుపట్టదు. అందుకే మీకు తగిన గర్ల్‌ఫ్రండ్‌ను ఎంచుకునే సమయంలో మిత్రులు చెప్పే మాటలను సైతం పరిగణనలోకి తీసుకోవడం మంచిది కాదు. అందుకే మీ కోసం చిట్కాలను వేడి వేడిగా సిద్ధం చేసి ఉంచాము.


1. మీ బంధాన్ని అర్థం చేసుకోండి

తొలి చూపులోనే ప్రేమలో పడటం అనేది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చేదే. ఆసమయంలో మీ కన్నా కూడా మీరు ప్రేమించిన అమ్మాయికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాంటి సమయంలో ఇద్దరూ ఒకచోట కలుసుకుందామని అనుకుంటారు. కానీ అనుకున్న సమయానికి మీ గర్ల్‌ఫ్రండ్ రాదు. గంటల కొద్దీ కాలాన్ని మీరు నిరీక్షణలోనే గడిపేస్తారు.


ఇక విసుగుపుట్టి మీరు ఇంటిముఖం పడతారు. మర్నాడు ఉదయం మీ గర్ల్‌ఫ్రండ్ పంపిన గ్రీటింగ్ కార్డుతో కూడిన ఫ్లవర్ బొకే మీ వాకిట కనపడుతుంది. అందులో సారీ చెప్తున్న మీ గర్ల్‌ఫ్రండ్ ముఖం కనపడుతుంది. అయినా మీరు కరగరు. మూడు రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నా మీ నుంచి రెస్పాన్స్ ఉండదు. ఇక బెట్టు మాని కొండ దిగి వచ్చి మీ గర్ల్‌ఫ్రండ్‌ను కలుసుకోండి. తద్వారా మీ బంధాన్ని అర్థవంతం చేసుకోండి.


2.గర్ల్‌ఫ్రండ్ కళ్లు తెలిపే భావాలు

మగవాళ్ల వలె ఆడవాళ్లు తమ మనసులోని భావాలను మాటల ద్వారా బహిర్గతం చేయడానికి ముందుకు రారు. అలాంటి సమయంలో మీ గర్ల్‌ఫ్రండ్ కళ్లు తెలిపే భావాలను చదివేందుకు ప్రయత్నించండి.

3.అమ్మాయిల అభిరుచులు వేరు

ప్రేమ అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. కేవలం శారీరక ఆకర్షణలకే పరిమితం కాకుండా మానసిక భావనలతో ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా మీ గర్ల్‌ఫ్రండ్ ప్రేమను చూరగొనండి.


4. అనేక పాత్రలలో ఒదిగిపోయి గర్ల్‌ఫ్రండ్ అభిమానాన్ని పొందండి

తనను వలచిన పురుషుని, యువతి ప్రేమికునిగాను, భర్తగానూ, ఇంకా చెప్పాలంటే ఆత్మీయునిగాను భావిస్తుంటుంది. కనుకనే సంతోష సమయాలలో, కష్టకాలంలో గర్ల్‌ఫ్రండ్‌కు అండగా నిలవడం ద్వారా మీలోని బహు రూపాలను ఆమె ఎదుట వ్యక్తీకరించండి.


5.చిన్న చిన్న పొరపచ్చాలు దూరం చేసుకోండి

ఆడవాళ్లు తమ మనస్సులోని భావనలను ఇతరుల ఎదుట సహజమైన రీతిలో వ్యక్తీకరిస్తుంటారు. తమకు ఏదైనా విషయం ఇబ్బంది కలిగిస్తే అందరికీ చెప్పేస్తారు. అయితే అబ్బాయిల వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వకుండా, ముందు నిలిచిన సమస్యలను తమంతటతాముగా పరిష్కరించుకోగలిగే ధైర్యాన్ని వాళ్లు ప్రదర్శిస్తుంటారు. అందుకే మీ గర్ల్‌ఫ్రండ్‌తో వ్యవహరించేటప్పుడు ఆమె మనస్సు నొచ్చుకోకుండా ప్రవర్తించండి.