Test Footer 2

01:15
0

సగటున ఒక మగాడు రోజుకు మూడు అబద్ధాలు చెబుతాడు అని డైలీ ఎక్స్ ప్రెస్ అంటోంది. దీన్ని బట్టి ఆడవాళ్ల కన్నా మగవాళ్లను తప్పుడు వాళ్లగా నిర్ధారించవచ్చు అని డైలీ ఎక్స్ ప్రెస్ అధ్యయనం పేర్కొంది. రోజుకు మూడు అబద్ధాలు ఆడే మగవాడు ఏడాదికి దాదాపు 1,092 అబద్ధాలు చెబుతాడనుకోవాలి. అదే మహిళల విషయంలో ఏడాదికి ఈ సంఖ్య 728 గా ఉంది, వారు రోజుకు రెండు అబద్ధాలు చెబుతారు. ఇక ఆడవాళ్ల అబద్ధాలు తాము వాడే వాటి వస్తువుల గురించి, ఇంట్లోని సరంజామా గురించి ఉంటాయి. వీటి విషయంలో 39 శాతం మంది ఆడవాళ్లు అబద్ధాలు చెబుతారు. అంటే వాటి ధర, క్వాలిటీ విషయంలోననమాట. ఇలాంటి వాటి గురించి అబద్ధాలుచెప్పే పురుషుల శాతం 26. ఇక ఫోన్ కాల్స్ విషయంలో, బాస్ లతో మాట్లాడేటప్పుడు మగవాళ్లు అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. దీంతో ఓవరాల్ గా మగవాళ్లు అబద్ధాల కోరులవుతున్నారు. ఇక ఆన్ లైన్ లోనైతే అబ్బాయిల అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు. ఇక్కడ 69 శాతం అబ్బాయిల టార్గెట్ ‘సెక్స్’ ఆన్ లైన్ లో అమ్మాయిల పరిచయాలను వారు కేవలం ఈ దృష్టితోనే చూస్తారు. ఫ్రెండ్షిప్ పేరుతో ఎన్ని కబుర్లు చెప్పినా( వీటిలోదాదాపు అబద్ధాలే) ఫైనల్ గా అబ్బాయిలు కోరుకొనేది సెక్సే! ఇలా ఇలా అబ్బాయిల అబద్ధాల కారణాల లిస్టు చాలా పెద్దదిగానే వివరించింది ఈ అధ్యయనం.