Test Footer 2

02:10
0

సెక్స్ తో రోగనిరోథక శక్తి మెరగవుంతుందిలా...!

ఎండార్పిన్ వల్ల మరో అదనపు ప్రయోజనం కూడా వుంది. ఇది కేవలం నొప్పిని నివారించడమే కాదు. మీ యెక్క రోగ నిరోధక శక్తిని కూడా స్వల్ప కాలికంగాను. అటు దీర్ఘకాలికంగాను కూడా అధికం చేస్తుంది. కామోద్రేకం వల్ల, మైధున కార్యక్రమం ద్వారా పెరిగే ఎండార్పిన్ స్రావాల శాతం యోగా, మెడిటేషన్, వ్యాయామాల వల్ల పెరిగిన దానితో సమానమని సైన్సు గుర్తించింది. ఈ స్రావాల శాతం తులనాత్మకంగా వుండే వారిలో రోగ లక్షణాలు తక్కువ స్థాయిలో కనిపిస్తుంటాయనేది కూడా వైద్యులు అంగీకరించే విషయం. అలాగే ఋతుస్రావ సమస్యలకు, ప్రొస్టేటు గ్రంధుల సమస్యలకు కూడా మైధునం పరమ ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆస్టిరీపోరోంసిస్ వంటి ఎముకల వ్యాధులు కూడా తలెత్తకుండా మైధున వ్యాయామం ఉపయోగపడుతుంది. తరచుగాను, పాల్గొన్నపుడల్లా ఎక్కువసేపు చేయడం వల్లనూ మీ చేతులు, కాళ్ళు కండరాలలో ఎముకలలో తగిన చైతన్యం ఏర్పడి, వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే ఇలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ విధంగా మైధునం ఒక చక్కని వ్యాయామ ప్రక్రియగా ప్రయోజనాలనందిస్తుంది. మీ శరీరంలోని జీవప్రక్రియలను అదుపు చేసి మీ బరువు మీ ఆదీనంలో వుండేలా కాపాడుతుంది మొత్తం మీద మైధునం వల్ల మీరు కళకళలాడుతూ కనిపిస్తారు. మీ జుట్టు మెరుస్తూ వుంటుంది. మీ కనులు తేజోవంతంగా వుంటాయి. మీ చర్మంపై చక్కని కాంతి, నునుపుదనం ఏర్పడుతుంది. అందుచేత స్త్రీపురుషుల లైంగికబంధం వల్ల శారీరకంగా అనేక ప్రయోజనాలు వున్నాయి. ముఖ్యంగా దీనివల్ల కలిగే మానసిక ఆనందం వల్ల మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపిస్తారు.