రొమాన్స్.. ఇది 100% ప్రేమికులకే కాపీరైట్. ప్రేమికులు డేటింగ్ కోసం కలుసుకునే ప్రదేశాలు.. కలవాలనుకునే ప్రాంతాలు ఏంటో తెలుసా..? హైటెక్ ప్రేమికులైతే... ఏ ప్యారిస్‌కో, రోమ్ నగరానికో లేదంటే పరుగ్వే, వెనిస్‌లకు వెళ్లి తమ రొమాన్స్‌ను 100% సక్సెస్ చేసుకుంటారు. ఇంకా కావాలంటే శాంటోరిని నగర నీలాకాశపు నీడన తెల్లటి నురగలుగక్కే సముద్ర తీరపు ఇసుకతెన్నెలపై కూచుని కువకువలాడుకుంటారు.
ఇంకాస్త హైటెక్‌గా గడపాలనుకుంటే మాత్రం నేరుగా జపాన్ దేశంలోని టోక్యో బే ఏరియాకు వెళ్లి హ్యాపీగా గడిపేస్తారు. అంతేనా.. కాలిఫోర్నియాలోని బిగ్ సూర్ సముద్రతీరం, జర్మనీలో మీర్స్ బర్గ్, ఫ్రాన్స్‌లోని సెయింట్ పాల్‌డె వెన్స్, యూఎస్ఎలోని శాన్‌ఫ్రాన్సిస్కో... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ అత్యుత్తమ రొమాంటిక్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నిటినీ చుట్టేసి తమతమ రొమాంటిక్ బుక్‌లో నిక్షిప్తం చేస్కుంటారు.
మరి సాధారణ... ఓ సగటు ప్రేయసీప్రియుల రొమాంటిక్ ప్లేస్ ఎక్కడ..? అని తరచి చూస్తే... అందమైన ఉద్యానవనాలు.. ఆ వనాల చాటును అల్లుకున్న పూలతలు.. ఆ పూలతల చాటున ప్రేమ మైకంలో అల్లుకుపోయే పడుచు జంటలు. ఇదీ నేటి ఆధునిక ప్రేమికుల డేటింగ్ హాట్ స్పాట్స్. దీనికి ఉదాహరణే ఈ సిత్రం.. చూడండి ఈ చిత్రం