Test Footer 2

02:13
0

sex : సెక్సు ఫీలింగ్



ఫ్రెసర్ – ఎంజిల్ (1981) అనుచరులు చేసిన పరిశోధనల్లో ఋతుచక్రానికి చెందిన పుటికలు, ల్యూటియల్ దశల్లో యోని మార్గంలో అధిక రక్తంగూడుకట్టడం వంటి స్థితి ఏర్పడ్డాన్ని గమనించారు. అండోత్సర్గదశలో కన్నా ఈ రెండుదశల్లోనే లైంగికోద్రేకాలు ఎక్కువ అని గమనించారు. అండోత్సర్గదశలోనే అధిక లైంగికోద్రేకాలు కల్గుతాయన్న వాదనను ఖండిస్తున్నాయి. ఆ పరిశోధనలు ఈ మధ్య జరిపిన మనికొన్ని పరిశోధనలు ఖండిస్తున్నాయి. ఈ పరిశోధనలు ఈ మధ్య జరిపిన మరికొన్ని పరిశోధనలు, పుటికలదశ అంత్యదశలోనూ అండోత్సర్గం దశ ప్రారంభం కాకముందు లైంగికోద్రేకాలు, ఆసక్తులు, అధికమయినట్లుగా తేల్చాయి. స్త్రీలల్లో వైయుక్తిక తేడాలు విస్తారంగా వుండటంతో కొంతమంది ఋతుచక్రం నడుమ దశలో, మరికొంతమంది ఋతుచక్రం పూర్తవుతున్న సందర్భాలల్లో సెక్సీగా ఫీలవుతున్నారు. ఋతుస్రావ సమయంలో రతి చేయటం నేటికి నిషేధంగానే వుంటోంది. కొన్ని కేసుల్లో ఋతుస్రావ సమయంలో సంభోగం మతాచారప్రకారం విరుద్దమైనపని, యూద్దుల్లో ఛాందసులు, ఋతువు కన్పించిన రోజునుండి 7 రోజులదాకా రతిని నిషేధించారు. ‘‘ మక్కా’’ అనే పవిత్ర స్నానం ఆచరించాకే తిరిగి సంభోగంలో పాల్గోంటారు. ఈ విషయాన్ని విడిచిపెడితే. ఋతుస్రావంలో సంభోగానికి వ్యతిరేకత చూపించటానికి సాంస్కృతిక మానసికకారకాలు వున్నాయి. డెలానీ, లుప్పాన్ ల అభిప్రాయం ప్రకారం ‘‘ ఒక మగవాడికి ఋతుస్రావంలో సంభోగించటానికి ఉత్సుకత చూపించినప్పటికీ, పురుషాంగానికి రక్తం అంటుకోవటం పట్ల ఇష్టం వుండదు’’ అది ప్రమాదకరమైనదని, కూడనిదని అభిప్రాయం ఏర్పడటం ఇందుకు కారణం ఈ కింద చెప్పబడిన వ్యాఖ్యలు మనుషులలో వున్న అభిప్రాయల తేడాలను చూపిస్తున్నాయి. 1. నేను పిరియడ్స్ లో ఉండగా లైంగిక బావనలు కల్గుతాయి. సంభోగంలో మరింత ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. 2. నా గర్లఫ్రెండ్ ఋతస్రావంలో వుండగా నాకు ఎందుకో సంభోగించటం ఇష్టం వుండదు.కారణం సరిగ్గా చెప్పలేను గానీ, నాకు ఫన్నీగా అన్పిస్తుంది. 3.నేను, నాస్నేహితురాలు, ఆమె పిరియడ్స్ లో ఉండగా సంభోగంలో పాల్గొంటాం, ఇది ఖచ్చితంగా ఆనందమయంగా వుంటుంది. పైగా గర్భనిరోధక సాధనాలు వాడనవసరం లేదు. 4.ఒక్కమాటలో చెప్పాలంటే పరమచికాకుగా వుంటుంది. నేను పిరియడ్స్ లో వుండగా పరిశుభ్రంగా లేనని అన్పిస్తుంది. ఋతుస్రావం బయటకు కనబడకుండా వాడే దుస్తులు అక్కడ అనుభూతులను పీల్చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి సంభోగంలో పాల్గొనడానికి, ఋతుస్రావం ఆగేదాకా నిరీక్షిస్తాం. నిజానికి, ఋతుస్రావంలో ఉండగా సంభోగం ప్రమాదకరమైనదన్న బావనలో వాస్తవంలేదు. అయినప్పటికీ కొంతమంది రతిలో చికాకు కలగడంతో సంభోగ వాంఛ పరిమితమైపోయి ఇతర మార్గాలవైపు దృష్టిని మారుస్తుందని భావిస్తారు. ఋతుస్రావంలో సంభోగంపై వైఖర్లు మారుతూవున్నాయి. నేటితరం వ్యక్తులకు వారి ముందుతరం వారికన్నా తక్కువ వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి.