Test Footer 2

02:05
0

లైంగిక అంశాలపై తప్పుడు ఆలోచనలు !




ఈ ఆధునిక యుగంలో సైతం పలు లైంగిక అంశాలపై ఎన్నో తప్పుడు ఆలోచనలు, తెలివి తక్కువ అభిప్రాయాలు సమాజంలో చెలామణిలో ఉన్నాయి.విధ్యాధికులు కూడా హస్త ప్రయోగం,అంగస్తంభనం, కన్నెపొర మొదలగు సెక్సువల్‌ విషయాల పట్ల అపోహలు,తప్పుడు అభిప్రాయములు కలిగి ఉన్నట్టుగా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పట్టణాలలో ఉండే విద్యావంతుల సంగతే ఇలా ఉంటే పల్లెల్లో నివసించే గ్రామీణుల లైంగిక విజ్ఞానం ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ రోజుల్లో పెద్దవారి కంటే పిల్లలే చాలా స్పీడుగా దూసుకుపోతున్నారు.ఎవరూ చెప్పకుండానే ఎన్నో విషయాలు తెలుసుకొంటున్నారు.ఈ విషయంలో ఇంటర్‌నెట్‌ పాత్ర అద్వితీయమైనది.అయితే సెక్సువిజ్ఞానానికి సంబందించి అధికారికమైన సమాచారం ఇక్కడ కూడా తగినంతగా లభించడం లేదు. అశ్లీల వెబ్‌సైట(్లఫోర్నో) హోరులో యువత చెడిపోతున్నారు.సెక్సువల్‌ పెర్వెర్టర్స్‌ గా తయారవుతున్నారు. అనాది నుండీ సెక్సును చీకటి వ్యవహారంగా పరిగణించి, దాని గురించి మాట్లాడటమే పాపంగా భావిస్తూ వచ్చారు. ఏదైనా సరే గుట్టుగా ఉంచినంతసేపూ దానిపై ఆసక్తి అధికమవుతూనే ఉంటుంది.అది కాస్తా రట్టు(ఓపెన్‌)చేసేస్తే, ఓస్‌... ఇంతేకదా అనిపిస్తుంది.సెక్సు కూడా అంతే! సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పొందటం వలన లైంగిక విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలుగుతుంది.సంసార జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో అర్ధమవుతుంది. అప్పుడు చుట్టుపక్కల వారు చేప్పే సంగతులు ఎంత నిరాధార మైనవో అవగతమవుతుంది.లైంగికత యొక్క పరమార్ధికత సుబోధకమవుతుంది. కాబట్టి సెక్సు ఎడ్యుకేషన్‌ ఆవశ్యకతను తల్లిదండ్రులు గమనించి,తమ పిల్లలకు మార్గదర్శకులుగా వ్యవహరించాలి. యుక్త వయసు వచ్చేవరకూ ఆగకుండా చిన్నప్పటినుండే లైంగిక అంశాల పట్ల వారిలో అవగాహన కలిగించాలి.సెక్సు విషయాలు కూడా సాధారణమైన విషయాలే అన్నట్టుగా మాట్లాడుతుండాలి. ఏదో పాఠం చెబుతున్నట్టుగా గాకుండా, సందర్భానుసారంగా వివరించటం మంచి పద్దతి.ఉదాహరణకు- టీవిలో కండోం గురించిన ప్రకటన వస్తుందనుకొందాం.అప్పుడు కండోం గురించి, దానితో సంబందమున్న ఇతర అంశాల గురించి చెబితే ఇంప్రసివ్‌గా ఉంటుంది.సెక్సు ఎడ్యుకేషన్‌కు సంబందించిన ఇటువంటి విషయాలన్నింటి గురించి మీ పిల్లలకు వివరంగా చెప్పాలంటే ముందుగా మీకు క్షుణ్ణంగా తెలియాలి కదా! ఆ లక్ష్య సాధన కోసమే