Test Footer 2

01:21
0

నేను నిన్ను ప్రేమిస్తున్నానని  I love you చెప్పాలంటే... ?

మనసులో రేగిన ప్రేమ భావాన్ని ప్రియురాలికి తెలిపేందుకు పురుష పుంగవులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రేమ లేఖలు, లవ్ గ్రీటింగులు, ముద్దొచ్చే గులాబీలు, ఛాటింగులు, ఎస్ఎమ్ఎస్‌లు అంటూ ఎన్ని మార్గాలున్నా తనదాకా వస్తే అవన్నీ వ్యర్థం అన్పిస్తాయి. 

తన మనసుకు నచ్చిన ప్రేయసికి తనలోని ప్రేమ భావాన్ని తెలియజేసేందుకు ఇంతవరకూ ఎవరూ ఉపయోగించని మార్గమేదైనా తనకు తెలిస్తే ఎంతబాగున్ను అని ప్రతి ప్రేమికునికీ అన్పిస్తుంటుంది. కానీ ప్రస్తుతానికి అవి తప్ప మరేమీ లేదని తెల్సినపుడు మనసు కాస్తా నిరాశకు గురవుతుంది. 

మనసులో రేగిన ప్రేమ అలజడిని తన ప్రేయసితో ఎలా పంచుకోవాలో తెలియలేదని అలానే ఉంటే ప్రేమ చెంతకు రాదుకదా. ప్రేమించిన అమ్మాయి చెంతకు రావాలంటే మీరు ప్రేమిస్తున్న విషయం ఆమెకు తెలిసి తీరాల్సిందే. అప్పుడే తిరస్కారమైనా, అంగీకారమైనా ప్రతిఫలంగా మీకు లభిస్తుంది.
సినిమా ట్రిక్స్ పనిచేయవు బాసూ...
  మనసుకు నచ్చిన అమ్మాయి కన్పించగానే వెంటనే దగ్గరకు వెళ్లి ఐలవ్యూ అంటూ చెప్పేయడానికి ఇదేమీ సినిమా కాదు. ఒకవేళ మీరు అలా చెప్పినా ఆ అమ్మాయి మిమ్మల్ని పిచ్చివాడిలాగా చూడడమో, చెంప పగలగొట్టడమో చేస్తుంది. అంతే తప్ప వెంటనే ఐ టూ లవ్యూ అంటూ మిమ్మల్ని వాటేసుకోదు.      

అలాకాక ఆలోచిస్తూ కూర్చుంటే ఎన్నాళ్లైనా అలా కూర్చోవాల్సిందే. దానివల్ల సమయం నష్టపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ మాకూ తెలుసు... కానీ ప్రేమను ఎలా చెప్పాలో మాత్రమే తెలియదు అంటారా... అయితే వినండి... ప్రేయసి దగ్గర ప్రేమను ఎలా చెప్పాలో... ? 

మనసుకు నచ్చిన అమ్మాయి కన్పించగానే వెంటనే దగ్గరకు వెళ్లి ఐలవ్యూ అంటూ చెప్పేయడానికి ఇదేమీ సినిమా కాదు. ఒకవేళ మీరు అలా చెప్పినా ఆ అమ్మాయి మిమ్మల్ని పిచ్చివాడిలాగా చూడడమో, చెంప పగలగొట్టడమో చేస్తుంది. అంతే తప్ప వెంటనే ఐ టూ లవ్యూ అంటూ మిమ్మల్ని వాటేసుకోదు. 

మీకు నచ్చిన అమ్మాయి కన్పించగానే తొందరపడిపోకుండా ఆ అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంటుంది అనే విషయాలు తప్పకుండా తెల్సుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆ అమ్మాయి దగ్గర చెబితే తాను కూడా మిమ్మల్ని ప్రేమించే అవకాశముందా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రేమకు ఎలాంటి అర్హతలు అక్కరలేదు. ప్రేమించడం తప్ప అనే మాటలేవీ నిజ జీవితానికి అచ్చిరావు.

ఆపై సలహాలేవీ అవసరం రాదులే...

  ఇక అప్పుడు లవ్ లెటర్ ఇవ్వడమో లేక సింపుల్‌గా ఓ గులాబీ ఇచ్చి మనసులో మాట చెప్పేయడమో, ఏదీ కాకుంటే కళ్లతోనే మాట్లాడేసుకోవడమో చేయవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి తెల్సుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల మీరంటే ఏంటనే సంగతి ఆపాటికే ఆమె కూడా గ్రహించేస్తుంది.      

ఎదుటివారిలో తనకు నచ్చిన అంశాలుంటేనే ఏ అమ్మాయి అయినా కొద్దిరోజుల తర్వాతైనా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వేస్తుంది. అలా లేకుంటే మీ ప్రేమ ఒన్‌సైడ్‌గానే ఉండిపోతుంది. అందుకే అన్ని విషయాలు తెల్సుకున్నాకే మీ ప్రేమను చెప్పేందుకు సిద్ధం కావాలి. అన్నీ తెల్సుకుని మీ ప్రేమ గురించి చెప్పేందుకు మీరు సిద్ధం కాగలిగారంటే ఆ చెప్పే విషయాన్ని ఎలా చెప్పాలనే విషయం కూడా ఆ పాటికే మీకు అవగతమైపోయుంటుంది. 

ఇక అప్పుడు లవ్ లెటర్ ఇవ్వడమో లేక సింపుల్‌గా ఓ గులాబీ ఇచ్చి మనసులో మాట చెప్పేయడమో, ఏదీ కాకుంటే కళ్లతోనే మాట్లాడేసుకోవడమో చేయవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి తెల్సుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల మీరంటే ఏంటనే సంగతి ఆపాటికే ఆమె కూడా గ్రహించేస్తుంది. 

అలాగే మీ మనసులోని భావం కూడా ఆమె దాదాపు గ్రహించేస్తుంది. దాంతో మీతో ఎలా ప్రవర్తించాలనే విషయం ఆమె ఓ నిర్ణయానికి వచ్చేసుంటుంది. అలాంటి తరుణంలో కూడా మీరు ప్రేమను గురించి చెప్పేందుకు సిద్ధం అయ్యారంటే అటువైపు నుంచి కూడా మీపై కొద్దిపాటి ఆకర్షణ మొదలయ్యందనే దాని అర్థం.