Test Footer 2

05:08
0

Venkatesh-Ramcharan Combo Movie?


Venkatesh-Ramcharan Combo Movie
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటంతో.... తెలుగు దర్శక నిర్మాతలంతా మల్టీ స్టారర్ సినిమాలపై వైపు మొగ్గు చూపుతున్నారు. అది కూడా స్టార్ హీరోల కాంబినేషన్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సోలో హీరోగా తనకు తగిన కథలు దొరకడం లేదని భావిస్తున్న వెంకటేష్ లాంటి వారు కూడా ఇలాంటి సినిమాపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటించిన వెంకటేష్...... ఎనర్జీటిక్ హీరో రామ్‌తో కలిసి మరో మల్టీ స్టారర్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో వచ్చిన బోల్ బచ్చన్ చిత్రానికి రీమేక్ గా దీన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. . ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రం రైట్స్ తీసుకుని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. తాజాగా ఫిల్మ్ నగర్లో మరో గాసిప్ వినిపిస్తోంది. వెంకటేష్-రామ్ చరణ్ కాంబినేషన్లో భవిష్యత్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కే అవకాశాలున్నాయని, దీన్ని వైజయంతీ మూవీస్ బేనర్ పై అశ్వినీదత్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ ‘షాడో' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. మరో వైపు రామ్ చరణ్ ‘నాయక్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని.... బాలీవుడ్ తొలి మూవీ ‘జంజీర్', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎవడు' చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు