Test Footer 2

21:17
0


జూ.ఎన్టీఆర్‌ New Movie 'బాద్‌షా' April 5న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనువైట్ల Director. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై bandla ganesh నిర్మిస్తున్నాడు. చిత్రాన్ని summer spesial రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్‌టైగర్‌ మాట్లాడుతూ..'శ్రీనువైట్ల చక్కటి సబ్జెక్ట్‌ ఎంచుకున్నారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించనున్నాడు. అన్నీ అంశాలుండేట్టు సరికొత్త స్టయిల్లో తీస్తున్నాడు. నా కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది' అని అన్నారు.
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ..'NTRఇమేజ్‌కు తగినట్టుగా వుంటూ Action, ఎమేషన్‌, ఎంటర్‌టైన్‌...సమపాళ్లలో వుంటాయి. ఒక కొత్త ఎన్టీఆర్‌ ఇందులో కనిపిస్తారు. ఎన్టీఆర్‌ అభినయం కూడా అద్భుతంగా వుంటుంది. వేసవి వినోదంగా మీ ముందుకు వస్తుంది. ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నా'మని అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ..'దూకుడులాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శ్రీనువైట్ల మా బ్యానర్‌లో చేస్తున్న మూవీ. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుంది. డ్యాన్స్‌, డైలాగ్స్‌ అన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. మార్చి 10న ఆడియో ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తాం. ఇందులో 50 మంది ప్రముఖ నటీనటులు పనిచేస్తున్నారు' అని అన్నారు. చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందించారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీనువైట్ల