Test Footer 2

01:31
0

KADALI AUDIO SONGS REVIEW

KADALI AUDIO SONGS REVIEW

మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా కడలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని పాటలు ఇటీవలే మార్కెట్లోకి వచ్చాయి. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. గతంలో మణిరత్నం-రెహమాన్ కలయికలో సంగీత అభిమానులు గుర్తుంచుకునే మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దీంతో కడలి పాటలపై అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కడలి పాటల సంగతి చూద్దాం.

ప్రేమకథతో రూపొందుతున్న కడలి సినిమాలో గౌతమ్ కార్తీక్, తులసీ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకు వనమాలి సాహిత్యం అందించారు.

మొదటి పాట : చిట్టి జాబిలి... గానం : విజయ్ ఏసుదాస్ ఆకాశం అందుకోవాలంటూ సాగే ఈ పాట మనిషి ఉత్సాహంగా ఉండాలని బోధిస్తుంది. నెమ్మదిగా సాగే ఈ పాట మనిషిలో నమ్మకం పెంచేదిగా ఉంటుంది. అయితే ఈ తరహా పాటల్లో ఉండే ‘జోష్’ ఈ పాటలో కనిపించదు. మణిరత్నం విధానంలో నెమ్మదిగా సాగుతుంది.

రెండవ పాట : యాడికే.... గానం : సిద్ శ్రీరామ్ ప్రేయసిని ఊహించుకుంటూ ప్రియుడి గానం చేసే విధంగా ఈ పాట సాగుతుంది. ప్రేమ కోసం ఎక్కడికైనా వస్తా అనే పదాలతో ఈ పాట సాగుతుంది

. మూడవ పాట : పచ్చని తోట... గానం : అభయ్ జోధ్ పుర్కార్, హరిణి ప్రేయసి-ప్రియుడు కలసి ప్రయాణం చేస్తున్నసమయంలో ఈ పాట సాగుతుంది. మణిరత్నం స్టైల్ లో ఈ పాట ఆకట్టుకుంటుంది. వినేవారిలో ఆహ్లదం నింపే ఈ పాటలో ‘పసరుల తావి’ వంటి పదాలు అచ్చ తెలుగును గుర్తుకు తెస్తాయి. మణిరత్నం స్టైల్ చిత్రీకరణతో ఈ పాటకు మరింత అందం వస్తుందని అభిమానులు తప్పకుండా భావించవచ్చు.

నాలుగవ పాట : యేలే జల్లే.. గానం : ఏ.ఆర్.రెహమాన్ ప్రియురాలను తలచుకుంటూ ప్రియుడి పాడుకునే పాట ఇది. రెహమాన్ గానం ఈ పాటకు కొత్త అందం తెచ్చింది. ఊషారుగా సాగే సంగీతంతో ఈ పాట ఆకట్టుకునే విధంగా సాగుతుంది

. ఐదవ పాట : గుంజుకున్నా... గానం : శక్తిశ్రీ గోపాలన్ ఈమధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయిన పాట ఇది. తమిళంలో ఈ పాట ఇంటర్నెట్ లో ఎక్కువ మందిని ఆకర్షించింది. మణిరత్నం-రెహమాన్ కలయిక స్థాయికి తగ్గట్లుగా పాట సాగుతుంది. అందమైన మెలోడి, మధురమైన గానంతో ఈ పాట ఈ అల్బమ్ లోనే బెస్ట్ సాంగ్. ఆకట్టుకునే సాహిత్యంతో పాట వినసొంపుగా సాగుతుంది.

ఆరవ పాట : మమతే నీవులే.. గానం : హరిచరణ్ ప్రియురాలిని గుర్తించేసుకుంటా, విరహంతో ప్రియడు పాడుకునే పాట ఇది. ఈ పాటలో కోరస్ హై పిచ్ లో సాగుతూ పాటకు మరింత అందాన్ని ఇచ్చింది. సంగీతం కూడా చాలా ఊషారుగా సాగుతుంది.

ఏడవ పాట : మగిడి మగిడి గానం : ఆర్యన్ దినేష్ కనగరత్నం, చిన్మయి, తన్వి శాహ్ ఉషారుగా సాగే ఈ పాట. ప్రేమికుల మధ్య సాగే పాటగా అనిపిస్తుంది. రెహమాన్ తరహా సంగీతంతో సాగే ఈ పాటలో మాటలు కొత్త తరహాలో వినిపిస్తాయి.